¡Sorpréndeme!

KL Rahul Strong Statement | RCB vs DC మ్యాచ్ లో వీర విజృంభణ తర్వాత కేఎల్ రాహుల్ మాస్

2025-04-11 2 Dailymotion

 అస్సలు ఊహించి కూడా ఉండదు ఆర్సీబీ. పెట్టింది 164 పరుగుల టార్గెట్టే కావొచ్చు కానీ 30పరుగులకే 3వికెట్లు పడిపోయినప్పుడు...ఢిల్లీ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయినప్పుడు గెలుపు మీద ఆశలు వచ్చి ఉంటాయి కానీ వాటిన్నింటనీ తునాతునకలు చేశాడు కేఎల్ రాహుల్. తను పుట్టి పెరిగిన బెంగుళూరులో చిన్న ప్పటి నుంచి క్రికెట్ ఆడుతూ ఎదిగిన చిన్నస్వామి స్టేడియంలో బాహుబలిలా విజృంభించాడు ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఆర్సీబీని వాళ్ల సొంత గడ్డపైనే ఓడించి...రేయ్ నేను ఈ గడ్డపై పుట్టారా అన్నట్లు స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కేఎల్ రాహుల్. ట్రిస్టన్ స్టబ్స్ ను పెట్టుకుని బౌండరీల మోత మోగించాడు. 53 బంతుల్లో 7ఫోర్లు 6 సిక్సర్లు బాది 93పరుగులు చేసి నాటౌట్ గా నిలవటమే కాదు 6 వికెట్ల తేడాతో తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కు అద్భుతమైన విజయాన్ని అందించి నేనూ ఈ గడ్డ మీద పుట్టానురా నేనే ఇక్కడ కింగ్ అన్నట్లు బ్యాట్ తో గిరీ గీసి పిచ్ ను చూపిస్తూ తన జూలు విదుపుతూ ఆకలిగొన్న పులిలా చేశాడు కేఎల్ రాహుల్. ఎప్పుడూ కామ్ కనిపించే కేఎల్ రాహుల్ అగ్రెసివ్ ఎక్స్ ప్రెషన్ ఇది. ఇదే విషయాన్ని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో కూడా చెప్పాడు. బెంగుళూరు తన ఇల్లు అని..ఈ గ్రౌండ్ తన సొంత గ్రౌండ్ అని...ఈ పిచ్ గురించి తనకు తెలిసినంత బాగా ఎవ్వరికీ తెలియదని చెప్పాడు కేఎల్ రాహుల్. నిజమే మరి. అసలు ఆశలు లేని మ్యాచ్ ను ఒంటి చేత్తో ఢిల్లీ వైపు తిప్పిన స్టబ్స్ తోడుగా రాహుల్ మోగించిన మరణ మృదంగం అంత వయొలెంట్ గా ఉంది మరి. తన అడ్డాలో మెంటల్ మాస్ ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి వాళ్ల సొంత గడ్డపై ఓటమి రుచి చూపించాడు.